WHAT'S NEW?
Loading...

Mark 1:12 Daily Bread

వెంటనే పరిశుద్దాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికోనిపోఎను 
                                          (Mark 1:12)
దేవుడుచేసిన మేళ్ళకి ఇది విచిత్రమైన ఉదాహరణ. వెంటనే..... అంటే దేని వెంటనే? ఆకాశం చీలి పరిశుద్దాత్మ పావురంలాగా క్రీస్తు మీదికి దిగి వచ్చి, తండ్రి దీవెన వాక్యం "నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నాను" అంటూ వినిపించిన వెంటనే.ఇది అసాదారణమైన అనుభవమేమి కాదు.నీ ఆత్మకి కూడా ఇలాంటి అనుభవాలు కొత్తేమి కాదు. నీ మనసు ఉస్తాహంతో గాలిలో తేలిన మరుక్షణం దిగులుతో పాతాళానికి క్రుంగిపోయిన సందర్భాలు లెవా.నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయకిరనాలతో ఊసులాడింది నీ హృదయం. ఈరోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి. దాని నోరు మూతపడింది. మద్యాహానం తండ్రి చిరునవ్వులతో కేరింతలు కొట్టావు. సాయంత్రం అయ్యేసరికి అరణ్య ప్రాంతాలలో తిరుగుతూ "నాదారి దేవునికి కనుమరుగైంది" అని నిట్టురుస్తున్నాను.

         'వెంటనే' అనే మాటలోని ఆదరనని గమనించావా. దీవెన వెంటనే యెడబాటు ఎందుకు కలగాలి? ఇంత త్వరగా కష్టం కలగడమే మనకి నిర్చయత కలుగజేస్తున్నది. ఎలాగంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి. ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్నదీవేనన్న మాట. నువ్వు అరన్యాలలోను, గేస్తేమనే తోటలలోను, కల్వరిలోను దైర్యవంతుడిగా ఉండాలని దేవుడు తన సన్నిదికాంతిని నీపై ప్రకాశింపజేస్తాడు. నువ్వింకా లోతుల్లోంకి దిగగాలగాలని నిన్ను పైకేతి నీకు బలాన్నిస్తాడు. అసహాయులకి సాయం చెయ్యడానికిగాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు.

అరణ్యంలోనికి పోవడానికి అన్ని వేళల్లోనూ నీకు శక్తీ చాలదు. యోర్దాను నది వడ్డున మహిమానుభావం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తీ వుంటుంది. బాప్తిసంలోని తేజస్సే అరణ్యంలో ఆకలిని తట్టుకోనేల చేయగలదు. ఆసీర్వాదాల తరువాత వచ్చేవి పోరాటాలే.

       ఆద్యాత్మిక జీవితాన్ని స్థిరపరచి దాన్ని అనేకరెట్లు అభివృద్ధి చెందించే పరిక్షలు సామాన్యమైనవి కావు. ఆ సమయాల్లో నరకమే దిగివచినట్లు ఉంటుంది. మనఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని సైతాను చేతికి అప్పగించాడని అర్ధమౌతుంది. అయితే ఆత్మకు దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్న వాళ్లకి ఈ అనుభవం ఒక గానవిజయానికి దారితీస్తుంది. శోదన తరువాత కాలమంతా జీవితానికి అరవైరెట్లు ప్రయోజనం కనిపిస్తుంది.

  "యుగయుగములకు ప్రభువు స్తోత్రార్హుడై యుండును గాక ఆమెన్!.." 

0 comments:

Post a Comment