WHAT'S NEW?
Loading...

1 kings 12:24 Daily Bread



జరిగినది నా వలననే జరిగెను (1 రాజులు 12:24) (1 Kings 12:24)

"బ్రతుకులోని నిరాశాలన్ని దేవుని ప్రేమ విశేషాలే" - రెవ.సి.ఎ.ఫాక్స్.
ప్రియ కుమారుడ,ఈ రోజు నీకోసం ఒక సందేశాన్ని తీసుకుని వొచ్చాను.దాన్నినీ చెవిలో చెప్పనీ,ముసురుకున్న కారుమబ్బులను అది మహిమ రధాలుగా మార్చేస్తుంది.నీ అడుగు పడబోతున్న ఇరుకుదారుల్ని మృదువుగా చేస్తుంది.ఈ సందేశంలో మూడే మాటలు ఉన్నాయి.దాన్ని నీ అంతరంగంలోనికి  ఇంకిపోనీ.నీ తలగడగా అది ఉపయోగపాడనీ.ఆ సందేశమేమంటే  "జరిగినది నా వలననే జరిగెను"

నీవేప్పుడన్నా ఆలోచించావా, నీకు సంబంధించిన వాటన్నిటిలో నా బాధ్యత కూడా ఉంది."మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నాడు" (జెకర్యా 2:8). (స్వేచ్చానువాదం). "నీవు నా దృష్టికి ప్రియుడవు"  (యెషయా 43:4). అందుకని నీకు సంగతులన్నీ  తెలియ జెప్పడం నాకెంతో ఇష్టం.

నిన్ను శోదనలెప్పుడు అటకాయిస్తాయో నీకు తెలియజేస్తాను.శత్రువులు ఎప్పుడు వరదలాగ వచ్చిపడతాడో చెప్తాను.ఇవన్నీ నా వలనే జరుగుతాయి.నీ బలహీనతకి నా శక్తిని జోడిస్తాను.ఈ పక్షంగా నన్ను యుద్ధం చెయ్యనివ్వడంలోనే నీకు క్షేమం ఉంది.
       నిన్ను అపార్దం చేసుకునే మనుష్యుల మద్య కష్టకాలంలో ఉంటున్నావా? వాళ్ళు నిన్ను లెక్కచెయ్యకుండా నిన్ను వోమూలకి నెట్టేస్తున్నారా? ఇదంతా చేయిస్తున్నది నేనే.

ఈ పరిస్థితులన్నిటికీ ప్రభువుని నేనే. నీవిప్పుడున్నా చోటికీ  రావడమన్నది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది కాదు. నేను నీకోసం నిర్దేశించిన స్థానమే ఇది.
     విదేయతను నేర్పమని అడిగావు కదూ.ఆ పాఠం నేర్పే బడిలో నిన్ను ఉంచాను.నీ పరిసరాలు,పరిస్థితులు నా ఇష్టాన్నినేరవేరుస్తున్నాయి.

గడ్డు పరిస్థితులలో ఉన్నావా? నువ్వు గడించేది పొట్ట కూటికే సరిపోవడం లేదా? ఇదంతా నావలననే జరుగుతున్నది. నీ మనీ పర్సు నాచేతిలోనే ఉంది. నామీద ఆధారపడి నాదగ్గర నుండి డబ్బు తీసుకో.
నా సంపదకి అంతు లేదు (ఫిలిప్పి 4:19). నా వాగ్దానాలను సొంతం చేసుకో. "మీ దేవుడైన యెహోవ యందు మీరు విశ్వాసం ఉంచలేదు" (ద్వితి 1:33) అనే మాట నీ పట్ల నిజం  కానివ్వకు.

శోకాల చీకటిలో ఉన్నావా, నేనే దానికి కారకున్ని.నేను చింతలేన్నిటినో అనుభవించాను. దుక్కమంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఇహలోకపు ఆదరణను నీకు సహాయపడకుండా చేశాను. ఎందుకంటె నావైపుకు తిరగడం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుంది (2 థెస్స్ 2:16-17). నాకోసం ఓ గొప్ప కార్యాన్ని తలపెట్టి ఇప్పుడు బాధలో,నీరసంలో,రోగివిగా ఉన్నావా?ఇది నావలన జరిగినదే నువ్వు హడావుడిగా తిరుగుతున్న రోజుల్లో నీకు ఏదైనా చెప్పాలంటే సాధ్యపడలేదు. నీకు కొన్ని లోతైన అనుభవాలను నేర్పిద్దాం అనుకున్నాను. ఊరక నిలిచి చూస్తుండే వాళ్ళు కూడా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నవారే. నాసేవకుల్లో గొప్పవాళ్ళు చాలామందిని పనిచేయ్యనివ్వకుండా కొంత కాలం అలా ఉంచాను. తద్వారా ప్రార్దన అనే ఆయుధాన్ని ఉపయోగించడం వాళ్ళు నేర్చుకున్నారు.

ఈనాడు నీ చేతుల్లో ఈ నునె పాత్రను పెడుతున్నాను.ఉచితంగా దాన్ని వాడుకో. నీకు ఎదురయ్యే ప్రతీ పరిస్థితిని, నిన్ను గాయపరిచే ప్రతిమాటని, నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతీ ఆలస్యాన్ని, నీ బలహీనతని నువ్వు గ్రహించిన ప్రతి సమయాన్నిఆ నూనెతో అబిషేకించు.అన్ని విషయాలలోనూ నా జ్యోక్యాన్ని నువ్వు అర్ధం చేసుకున్నట్లైతే నీలో కలుక్కుమనే బాద ఉండదు

                          "ఇది నావలనే అన్నాడు" రక్షకుడు
                          వంగి నా నుదురు ముద్దు పెట్టుకున్నాడు
                          "నిన్ను ప్రేమిస్తున్నవాడె దీన్ని చేసాడు
                          నన్ను నమ్మి ఇప్పటికి ఓపికపట్టు"

                                             నీ అవసరాలు తెలుసు నీ తండ్రికి
                                             నీకు దొరకనివాటికోసం బాదపడకు
                                             నేను పంపేవె నీకు క్షేమకారకలు
                                             నీళ్ళు నిండిన కళ్ళతో వేడుకున్నాను

      "ప్రియ ప్రభు క్షమించు, గ్రహించలేక పోయాను
       నేను వెళ్ళే ప్రతీ దారిలో నాకంటే ముందు నీ పాదాలు వెళ్ళాయి
       నా క్షేమానికి ఇదే సరైనది,అందుకే పాడతాను
       నీ కృప నాకు సరిపోతుంది,నువ్వేర్పరిచినదే నాకతి మధురం"

                                        "యుగయుగములకు ప్రభువు స్తోత్రార్హుడై యుండును గాక ఆమెన్!.." 

0 comments:

Post a Comment