WHAT'S NEW?
Loading...

Isaiah 49:2 Daily Bread

తన చేతి నీడలో నను దాచి ఉన్నాడు నన్ను మేరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు (యెషయ 49:2) (Isaiah 49:2)

"నీడలో" మనమందరం నీడలోకి ఏదో వొక సమయంలో వెళ్ళాలి. ఎండ కళ్ళను మిరిమిట్లు గొల్పుతుంది, కళ్ళు దెబ్బతింటాయి. ప్రకృతి వర్ణాలను.వివిధ రంగుల్ని గుర్తుపట్టే శక్తిని కోల్పోతాయి. వ్యాదికి లోనయ్యి మసక చీకటికమ్మిన గడిలోనో. మనవల్లెవ్వరన్న చనిపోతే దుక్ఖ చాయలో కమ్మిన ఇంట్లోనో కొన్నలు ఉండాలి.
కానీ బయపడవొద్దు అవి దేవుని చేతి నీడలే. ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు. నీడలో మాత్రమే నెర్చుగలిగిన కొన్ని పాటాలు ఉన్నాయి.
అయన వదనాన్ని చూపించే చిత్రం చీకటిగదిలోనే వ్రేలడుతుంది. చీకటిలో ఉండి అయన నిన్ను ప్రక్కకి నేట్టేస్తాడని అనుకోవద్దు సుమీ. నువ్వింకా అయన అంబుల పోదిలోనే ఉన్నావు. పనికిరాని దాన్ని పరేసినట్లు అయన నిన్ను పారేయలేదు.

సమయం వచ్చేదాక నిన్నల ఉంచుతున్నాడు. సమయం వచినప్పుడు గురిపెట్టి నిన్ను పంపాలనుకున్నచోటికి రివ్వున వదులుతాడు.తద్వారా అయన మహిమ పొందుతాడు. నీడల్లో,వంటరితనంలో కాలం గడుపుతున్న వాళ్ళల్లార, అంబులపొది విలుకాడి వీపుకి ఎంత గట్టిగ కట్టేసిఉంటుందో తెలుసుకదా.చేయిచాపితే అందేలా ఉంటుంది.దాన్ని అతడెప్పుడు పోగొట్టుకోడు.

కొన్ని సందర్బాలలో చీకటి స్థితిలో ఎక్కువ ఎదుగుదల ఉంటుంది. మొక్కజొన్న ఎండాకాలపు వెచ్చని రాత్రులలో పెరిగినంత వేగంగా మరెప్పుడు పెరగదు. మద్యహనపు ఎండలో దీని ఆకులూ వంకీలు తిరిగి ముడుచుకుపోతాయి. కాని ఏదన్నా మబ్బు సూర్యున్ని కమ్మగానే తిరిగి తెరుచుకుంటాయి.వెలుగులో లేని శ్రేష్టత కొన్నిసార్లు నీడలో ఉంటుంది. ఆకాశంలో రాత్రి వ్యపించినప్పుడే నక్షత్ర లోకం సాక్షాత్కరిస్తుంది.సూర్యరస్మిలో వికసించని పూలు కొన్ని రాత్రివేళ విరబూస్తాయి. అలాగే మామూలు సమయాల్లో మనకు కనబడని సద్గునాలెన్నో కష్టకాలాల్లో స్పష్టంగా బయటకి కనిపిస్తాయి.

               బ్రతుకు నిండా ఎండలే మండిపోతే
               ముఖం కమిలి వాడిపోతుంది
               చల్లని చిరువాన జల్లులు పడితే
               అది నవజీవంతో కలకలలాడుతుంది.....

                                          "యుగయుగములకు ప్రభువు స్తోత్రార్హుడై యుండును గాక ఆమెన్!.."   

0 comments:

Post a Comment